Home  »  TV News  »  Podharillu: విడాకులు తీసుకోమని మహాలక్ష్మికి సలహా ఇచ్చిన హారిక!

Updated : Mar 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-71 లో.. ఒక హోటల్ లో హారిక, మహాలక్ష్మి కలుసుకొని మాట్లాడుకుంటారు. నా సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ తెచ్చుకోమని అంటాడేమోనని అనుకున్నాను‌ కానీ మళ్ళీ ఆ జుట్టుపోలీ గాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాడని మహాలక్ష్మి అంటుంది. హారిక మౌనంగా ఉంటుంది. నేను నిజం చెప్పినా ఎవరు వినరని నాకు అర్థం అయింది. నా డ్రీమ్స్ ఫుల్ ఫిల్ అవ్వవని అర్థం అయింది. అందుకే బయటకొచ్చానని హారికతో మహాలక్ష్మి అంటుంది.

ఇంతకు ఆ ఇంట్లో సేఫ్ గానే ఉన్నావ్ కదా అని హారిక అనగానే నిజానికి మన ఇంట్లో మనుషుల కంటే వాళ్ళ మధ్యనే సేఫ్ గా అనిపిస్తుందని మహాలక్ష్మి అంటుంది. నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ ఇంట్లోనే చక్రితో భార్యగా సెటిల్ అయ్యేలా ఉన్నావని హారిక అంటుంది. చెప్పాను కదా మాది అసలు పెళ్ళే కాదని అని మహాలక్ష్మి అంటుంది. కానీ చట్టం దృష్టిలో మీరిద్దరు నిజమైన భార్యాభర్తలు అని హారిక అంటుంది. నాకు అసలు ఇష్టమే లేదు కానీ పెళ్ళి చేసి మాకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చి మమ్మల్ని విడిపోకుండా చేశారని మహాలక్ష్మి అంటుంది. వీలైనంత తొందరగా విడాకులు తీసుకోమని హారిక అంటుంది. సరేనని మహాలక్ష్మి అంటుంది. 

ఇక ఇంటికొచ్చిన మహా చక్రితో మాట్లాడుతుంది. మనం విడాకులు తీసుకుందామని అనగానే చక్రి షాక్ అవుతాడు. మీ వదిన నువ్వు కలిసి మాట్లాడుకుంది ఇదేనా అని చక్రి అనుకుంటాడు. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు.. మీ పెళ్ళి చెడగొట్టాలి.. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి.. ఇప్పుడు విడాకుల కోసం కోర్ట్ చుట్టూ నాకంటు మనసు ఉండదా అని చక్రి అంటాడు. మీ ఇంట్లో అందరు మంచివాళ్ళే కదా.. నన్ను ఒక గాజుబొమ్మలా అపురూపంగా చూసుకున్నారు.. మీది నాచురల్ గా హెల్పింగ్ నేచర్.. మీకేం స్వార్థం ఉంటది చెప్పండి పదా వెళ్దామని చెప్పి మహా వెళ్ళిపోతుంది. ఇక పొద్దున్నే మహాలక్ష్మి, చక్రి కాసేపు గొడవపడతారు. మరోవైపు చక్రి వాళ్ళ నాన్న నారాయణ ఎవరితోనో గొడవ పడుతుంటాడు. లాయర్ ని వెతకమని   చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటుంది. ఇంకో రెండు మూడు వారాల్లో దొరుకుతాడని చక్రి అనగానే అన్ని వారాలు ఎందుకని మహాలక్ష్మి అంటుంది. నేనే ఆన్లైన్ లో చూస్తున్నానని మహా అంటుంది. తర్వాత మహ, చక్రి ఇద్దరు మాట్లాడుకుంటారు.  ఇక మరుసటి రోజు ఉదయం చక్రి, మహా కలిసి లాయర్ ని కలవడానికి వెళ్తారు‌. అక్కడ ఇద్దరు లాయర్ కోసం ఎదురుచూస్తుంటారు. శ్రీకృష్ణ ప్రతీసారీ కాపాడతావ్.. ఈ సారి కూడా ఎలాగైనా చక్రం అడ్డం వేసి కాపాడమని చక్రి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.